అనౌన్స్: సంక్రాంతి బరిలో పవన్-క్రిష్ సినిమా

అనౌన్స్:  సంక్రాంతి బరిలో పవన్-క్రిష్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి కావడంతో మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రానుండగా.. పవన్-క్రిష్ #PSPK27 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేసుకు వెళ్ళింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మొగలాయిలా కాలం నాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహాశివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో పోటీ పడనుంది.