భీమవరం ఎమ్మెల్యేపై పవన్‌ ఫైర్... ఓ ఆకు రౌడీ అంటూ...!

 భీమవరం ఎమ్మెల్యేపై పవన్‌ ఫైర్... ఓ ఆకు రౌడీ అంటూ...!

భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అంటూ ఫైర్ అయిన జనసేనాని... కో-ఆపరేటివ్ బ్యాంకులను దోచుకున్న వ్యక్తి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు సేవ చేయడం మాని.. ప్రజలను హింసిస్తున్నారంటూ ఆరోపించారు పవన్ కల్యాణ్... రోడ్డుపై వెళ్తుంటే కుక్కలు మెరుగుతాయని.. మేం అలా చేయలేం అంటూ హాట్ కామెంట్లు చేసిన ఆయన.. నన్ను వ్యక్తిగతంగా తిట్టడం రివాజుగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, మత్స్యపురిలో దళితులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి... జనసేన కార్యకర్తలు సంఘ విద్రోహ శక్తులుగా అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించిన ఆయన.. బాధ్యులపై కేసులు పెట్టకపోతే చలో మత్స్యపురికి పిలుపునిస్తామని హెచ్చరించారు.. దళితులపై దాడి జరిగిందని తెలిసి వెళ్లిన తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పవన్ మెడ మీద తలకాయలు ఉండవ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు గ్రంధి శ్రీనివాస్.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే భీమవరంలో కాకరేపుతున్నాయి.. జనసేన వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది పరిస్థితి.