వకీల్ సాబ్ రిలీజ్ : తిరుపతిలోని థియేటర్ల వద్ద ఉద్రిక్తత

వకీల్ సాబ్ రిలీజ్ : తిరుపతిలోని థియేటర్ల వద్ద ఉద్రిక్తత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'.. ఇవాళ విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 కుపైగా థియేటర్లలో ఇవాళ రిలీజ్‌ అవుతున్న వకీల్‌సాబ్‌పై భారీ అంచనాలున్నాయి. అలాగే కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో విడుదలవుతోన్న భారీ చిత్రం వకీల్‌ సాబ్‌ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే పవన్‌ అభిమానుల కోసం శుక్రవారం బెనిఫిట్‌ షోలు ఏర్పాటు చేశారు. అయితే.. తిరుపతిలోని థియేటర్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది.  వకీల్ సాబ్ ఫ్యాన్స్ షోను  సినిమా హాల్లు ప్రదర్శించలేదు.  ఉదయం ఎనిమిది గంటలకు ప్రదర్శించాల్సిన సాధారణ షోలను సైతం నిలిపివేయాలని థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ అయ్యాయి.   ఉదయం ఎనిమిది గంటల షోకు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులను తిరిగి ఇచ్చేస్తుంది థియేటర్‌ యాజమాన్యం. దీంతో ఆగ్రహం చెందిన ప్రేక్షకులు థియేటర్ పై రాళ్ళ దాడి చేశారు. ఈ ఘటనలో ఓ థియేటర్ అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.