స్టీల్ ప్లాంట్‌ లొల్లి ఢిల్లీకి..! హస్తినకు జనసేనాని..

స్టీల్ ప్లాంట్‌ లొల్లి ఢిల్లీకి..! హస్తినకు జనసేనాని..

కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అలజడి మొదలైంది... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధం కావడంతో.. ఒక్కసారిగా.. దీనిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు.. నిరసన కార్యక్రమాలు నిర్వహించగా... ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఈ వ్యవహారంపై కేంద్రానికి లేఖరాశారు. ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు జనసేనాని.. ఆయన వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ పరిణామాలపైనే ఈ సారి ఢిల్లీ వెళ్లారు.. తన పర్యటనలో బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కేంద్ర పెద్దలను కలవనున్నారు పవన్ కల్యాణ్. స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ పెద్దలకు పవన్ కల్యాణ్ ఏం చెబుతారు.. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ వైఖరితో పాటు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా మారిపోనుందా? అనేదానిపై మాత్రం మరికొంత సమయం వేచిచూడాలేమో మరి.