నీ కోట ముందుకొచ్చా.. నా పేరు పవన్ కల్యాణ్

నీ కోట ముందుకొచ్చా.. నా పేరు పవన్ కల్యాణ్

మీ కోటకు వచ్చా.. నేనే పవన్ కళ్యాణ్ ను... అశోక్ గజపతిరాజు కు  పవన్ అంటే ఎవరో తెలియదంటా అని... విజయనగరం జిల్లా పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై జనసేన అధినేత పవన కళ్యాణ్ ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశాను. మీ అనుభవిస్తున్న పదవిలో పవన్ తన పాత్రని గుర్తు చేశారు. డిల్లీకీ రాజైన అమ్మకు కొడుకు అన్న  విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుదేశం, వైసీపీ నాయకులు జనసేన సైనికులను బయపెడితే చేతులు ముడుచుకొని కూర్చునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. జనసేన సర్వ మతాలను అభిమానించే పార్టీ అన్నారు పవన్. తెలుగుదేశం పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉండే మద్యం షాపులన్నీ ఎవరివనేది మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఇక్కడి నాయకులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి కేబుల్ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన  ఏపీలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.