హస్తినలో జనసేనాని.. అమిత్‌షాతో కీలక చర్చలు

హస్తినలో జనసేనాని.. అమిత్‌షాతో కీలక చర్చలు

హస్తిన పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు.. అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.. ఏపీలో బీజేపీకి భాగస్వామ్య పక్షంగా ఉంది జనసేన పార్టీ.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఇప్పుడు రాష్ట్రంలో కాకరేపుతుండగా.. వెంటనే ఢిల్లీకి పయనం అయ్యారు పవన్.. పార్లమెంట్‌లో అమిత్ షాతో భేటీ అయిన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. స్టీల్ ప్లాంట్‌ వ్యవహారంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఈ భేటీలో షాకు వినతిపత్రం కూడా అందజేశారు.. మరోవైపు.. తిరుపతి ఉప ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక, మరికొంతమంది కేంద్ర మంత్రులతో పాటు.. బీజేపీ అగ్రనేతలను కూడా ఈ పర్యటనలో కలవనున్నారు పవన్ కల్యాణ్.. విశాఖ స్టీల్ కర్మాగారంపై ప్రభుత్వ ఆలోచన, వాస్తవాలు తెలుకొనేందుకు ఢిల్లీ వెళ్లారు పవన్.. లోకసభ సమావేశం ముగియగానే కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కావాలని ప్లాన్‌తో ఉన్నారు. మరోవైపు ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, సంయుక్త 
భవిష్యత్ కార్యాచరణపై కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో జనసేన నేతల చర్చించే అవకాశం ఉందంటున్నారు.