వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ.. ఇలా స్పందించిన వపన్ కల్యాణ్

వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ.. ఇలా స్పందించిన వపన్ కల్యాణ్

వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.. ఇక, ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. షర్మిల కొత్త పార్టీపై స్పందించారు.. కేంద్రమంత్రులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్‌కు షర్మిలా పార్టీపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది.. దీనిపై స్పందించిన జనసేనాని.. షర్మిలా ఇంకా పార్టీ స్థాపించలేదు కదా?, పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడదాం అన్నారు.. ఇక, ప్రతీ ఒక్కరూ పార్టీ పెట్టుకోవచ్చు అని కామెంట్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే కోరుకుంటున్నా అన్నారు. ఆ వెంటనే కేసీఆర్ పాలనపై ప్రశ్న ఎదురు కాగా.. కేసీఆర్ పాలన గురించి హైదరాబాద్‌లోనే మాట్లాడతానని దాటవేశారు. కాగా, ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన జనసేన అధినేత.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో పాటు.. ఏపీలో శాంతిభద్రతలు, దేవాలయాలపై దాడులు, బీజేపీ-జనసేన పార్టీ పొత్తు తదితర అంశాలపై చర్చించారు.