ఇంగ్లాండ్ కు షాక్... భారీ టార్గెట్ ను బద్దలు కొట్టిన ఐర్లాండ్...

ఇంగ్లాండ్ కు షాక్... భారీ టార్గెట్ ను బద్దలు కొట్టిన ఐర్లాండ్...

ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య సౌతాంప్టన్‌ వేదికగా వన్డే సూపర్ లీగ్ లోని మొదటి సిరీస్ లో నిన్న జరిగిన చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టు ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చింది. సిరీస్ ను వైట్ వాష్ చేసేలా కనిపించిన ఆతిధ్య జట్టు పైన విజయం సాధించి సిరీస్ ను 2-1 తో కోల్పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, ఎయోన్ మోర్గాన్ (106) సెంచరీతో అలాగే టామ్ బాంటన్(58), డేవిడ్ విల్లీ(51) అర్ధ శతకాలతో రాణించడంతో 328 పరుగులు చేసింది. 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఐర్లాండ్ ఇంకా ఒక బాల్ మిగిలి ఉండగానే విజయం సాధించింది, అయితే బౌలింగ్ లో కూడా  ఐర్లాండ్ ఇంగ్లాండ్ ను ఒక బంతి మిగిలి ఉండగానే ఆల్ ఔట్ చేసింది. ఇక బ్యాటింగ్ లో పాల్ స్టిర్లింగ్ (142), ఆండ్రూ బాల్బిర్నీ (113) ఇద్దరు రెండో వికెట్ కు 214 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. దాంతో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఈ చివరి మ్యాచ్  ఐర్లాండ్ గెలిచినా సిరీస్  ఇంగ్లాండ్ గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పాల్ స్టిర్లింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలువగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా డేవిడ్ విల్లీ నిలిచాడు.