ఐపీఎల్‌ నుంచి కమిన్స్‌ ఔట్‌

ఐపీఎల్‌ నుంచి కమిన్స్‌ ఔట్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు తప్పుకొంటున్నాడు. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్‌ స్టార్క్‌ టోర్నీకి దూరమవగా ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ జట్టు నుంచి స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌ దూరమవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో కమిన్స్‌కు గాయమైందని, స్కానింగ్‌ నిర్వహిస్తే గాయం తీవ్రమైనదని తేలిందని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. కమిన్స్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఐపీఎల్‌ నుంచి తప్పుకొంటున్నాడని పేర్కొంది. త్వరలో జరిగే ఇంగ్లండ్‌ పర్యటనకు కమిన్స్‌ అందుబాటులో ఉంటాడో లేదో అన్నది రీస్కాన్‌ తర్వాత తేలుతుందని ఫిజియో చెప్పాడు. కాగా.. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సైతం కమిన్స్‌ ఆడలేదు. జనవరిలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ముంబై ఇండియన్స్‌ రూ.5.4కోట్లకు కమిన్స్‌ను దక్కించుకుంది.