మీకు మీరుగా కొత్త చట్టాలు తెండి.. రాష్ట్రాలకు సోనియా సూచన..

మీకు మీరుగా కొత్త చట్టాలు తెండి.. రాష్ట్రాలకు సోనియా సూచన..

ప్రతిపక్షాలు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా కేంద్ర ప్రభుత్వం అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది.. ఇక, ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, ప్రతిపక్షాలు రైతులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అమలుచేయకుండా ఉండేందుకు ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించాలని సూచించిన ఆమె.. ఇదే సమయంలో మీకు మీరుగా కొత్తగా చట్టాలు తెచ్చుకొనడం గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిరంకుశ వ్యవసాయ చట్టాలను అధిగమించే చర్యలు, ప్రయత్నాలపై దృష్టిపెట్టాలని .. రైతులను రక్షించే చట్టాలను ఆయా ప్రభుత్వాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి సెంటర్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తిరస్కరించడానికి కొత్త చట్టాలను తేవాలని రాష్ట్రాలకు సూచన చేశారు.