రహానే ఔట్... నిలబడిన పుజారా

రహానే ఔట్... నిలబడిన పుజారా

ఆసీస్ తో చివరి టెస్ట్ మ్యాచ్ లో నేడు ఆఖరి రోజు ఆట జరుగుతుంది. అయితే నిన్నటి ఆటలో భారత బౌలర్లు ఆసీస్ ను 294 పరుగులకు ఆల్ ఔట్ చేయగా మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు ఉన్న 33 పరుగుల ఆధిక్యంతో భారత్ ముందు 328 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే నిన్న వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసిన భారత్ ప్రస్తుతం 179/3 తో నిలిచింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే పెవిలియన్ కు చేరుకోగా తర్వాత మరో ఓపెనర్ గిల్ 91 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న పుజారాతో కలిసి బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కెప్టెన్ రహానే(24) త్వరగా పరుగులు చేయాలనే ఉదేశ్యంలో కీపర్ క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. అయితే ప్రస్తుతం పుజారా(43), పంత్(9) తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.