సచిన్ ను ట్రోల్ చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్...

సచిన్ ను ట్రోల్ చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్...

భారత దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి అందరికి తెలుసు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సచిన్ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందులో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా సచిన్ ట్విటర్‌ లో గార్డెన్‌ లో విశ్రాంతి తీసుకుంటున్న తన ఫొటో పోస్ట్ చేసాడు. దానికి ''కలల ప్రపంచంలో విహరిస్తున్నాను'' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్ కు కామెంట్ జత చేస్తూ ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ పనేసర్‌ సచిన్ ను ట్రోల్ చేసాడు. టెండూల్కర్ ఫొటోకు... ''ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలుస్తుంది అని కల కంటున్నావా'' అనే కామెంట్ పెట్టాడు. ఇక సచిన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున 78 మ్యాచ్ లు ఆడి 2334 పరుగులు చేసాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ విజేత విషయంలో సచిన్ ఇంతకముందే క్లారిటీ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్  ఫైనల్ కు కూడా రావని టెండూల్కర్ తెలిపాడు. ఈ ఏడాది కోహ్లీ న్యాయకత్వం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ విజేతగా నిలుస్తుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది, కావాలంటే దీనిని రాసిపెట్టుకోండి అంటూ చెప్పాడు.