భూమిపూజ ముహూర్తం పెట్టిన వ్యక్తికి బెదిరింపు కాల్స్ ?
అయోధ్యలో ఈరోజు రామాలయ నిర్మాణానికి భూమి పూజకు సమయం దగ్గర పడుతున్న వేళ కర్ణాటకలో బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది.ఈ పూజా కార్యక్రమానికి ముహూర్తంపెట్టిన పూజారికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదింపులు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన పండితుడు ఎన్ఆర్ విజయేంద్ర శర్మ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్ దేవ్ గిరిజకి సన్నిహతులు. ఆయన కోరిక మేరకు ఏప్రిల్లో అక్షయ తృతీయ నాడు ముహూర్తం పెట్టారు. అయితే లాక్డౌన్ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
దీంతో ఆగస్టు 5వ తేదీ అంటే ఈరోజున భూమిపూజకు ముహూర్తంగా ఖరారు చేశారు. ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ పూజ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ముహూర్తాలు పెట్టిన విజయేంద్రకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. రామాలయ భూమిపూజకు ముహూర్తం తేదీని ఎందుకు నిర్ణయించావని, అలా ముహూర్తం నిర్ణయించినందున తనను చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారని విజయేంద్ర శర్మ తెలిపారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక బెళగావిలో ఉన్న పూజారి నివాసం వద్ద భద్రతా కల్పించారు
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)