పల్లె రఘునాథరెడ్డికి సతీవియోగం

పల్లె రఘునాథరెడ్డికి సతీవియోగం

ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాధరెడ్డి సతీమణి పల్లె ఉమా ఆనారోగ్యంతో మరణించింది. కొంతకాలంగా ఆమె హైదరాబాద్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పల్లె రఘునాథరెడ్డి భార్య మృతి పట్ల ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.