భారత జట్టు పై పాక్ ప్రశంసలు...

భారత జట్టు పై పాక్ ప్రశంసలు...

గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి టెస్ట్ సిరీస్ సొంతం చేసుకుంది టీ ఇండియా. అయితే ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించగానే సోషల్ మీడియా వేదికగా క్రికెట్ మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. కీలక ఆటగాళ్ల లేకున్నా.. యువ క్రికెటర్లు 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు గబ్బాలో ఓటమి రుచి చూపించిన తీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. అయితే పాకి​స్తాన్‌ ఫాన్స్ సైతం భారత జట్టు విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేయడం గమనార్హం. అజింక్య రహానే కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ కామెంట్లు చేశారు. భారత జట్టు నేడు వారి క్లాస్‌ ఆటను చూపించింది. మీరు ఇలాగే ఆడుతూ ఉండాలి అని ట్విట్స్ లో పేర్కొన్నారు. భారత జట్టు లాగే పాకిస్తాన్‌ కూడా మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు.