పాక్ లో రేపిస్టులకు కొత్త శిక్ష: మగతనం కట్...!!

పాక్ లో రేపిస్టులకు కొత్త శిక్ష: మగతనం కట్...!!

పాక్ లో ఇటీవల హైవేపై ప్రయాణం చేస్తున్న ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.  ఈ ఘటన పాక్ లో సంచలనం సృష్టించింది.  ఇప్పటికే పోలీసులు సామూహిక అత్యాచారం కేసులో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  మరోనిందితుడి కోసం గాలిస్తున్నారు.  రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని పెద్ద ఎత్తిన డిమాండ్ చేస్తున్నారు.  అయితే, దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. 

అయితే ప్రభుత్వం రేపిస్టులకు విధించే శిక్షలకు సంబంధించిన చట్టాలను మార్చబోతున్నది.  దోషులను ఉరి తీసే విధానాన్ని పక్కన పెట్టబోతున్నది.  యూరోపియన్ యూనియన్ నుంచి పాక్ ప్రత్యేక వాణిజ్య హోదా పొందటంతో, ఉరి విధానాన్ని పక్కన పెట్టబోతున్నది.  దీని స్థానంలో కొత్త చట్టం అమలు చేసేందుకు పాక్ సిద్ధం అవుతున్నది. రేపిస్టులకు ఫస్ట్ డిగ్రీ అమలు చేసి, కెమికల్ పద్దతుల ద్వారా కాస్ట్రేషన్ చేసే విధంగా చట్టాలను మార్చబోతున్నది.  ఇలా చేయడం వలన జీవితంలో సదరు వ్యక్తి మరోసారి అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉండదని పాక్ ప్రభుత్వం భావిస్తోంది.  అయితే ప్రజలు మాత్రం రేపిస్టులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.