పాకిస్థాన్ ఆటగాళ్ల జెర్సీ పై ఆఫ్రిదీ ఫౌండేషన్ లోగో... 

పాకిస్థాన్ ఆటగాళ్ల జెర్సీ పై ఆఫ్రిదీ ఫౌండేషన్ లోగో... 

తమ జాతీయ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌ను కనుగొనడంలో కష్టపడుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌లో తమ ఆటగాళ్ల  జెర్సీలపై షాహిద్ ఆఫ్రిదీ ఫౌండేషన్ కు సంబంధించిన లోగోను వేయబోతుంది. "పాకిస్తాన్ ప్లేయింగ్ కిట్లలో మా లోగో ప్రదర్శించబడుతుందని మేము సంతోషిస్తున్నాము, వాసింఖాన్ & పీసీబీ వారి నిరంతర మద్దతుకు ధన్యవాదాలు మరియు పర్యటనలో మా ఆటాగాళ్లకు శుభాకాంక్షలు" అని మాజీ కెప్టెన్ ఆఫ్రిదీ ట్వీట్ చేశాడు. అయితే పీసీబీకి ఇంతక ముందు పెప్సీ కంపెనీ స్పాన్సర్ గా ఉండేది.  ఆ ఒప్పందం ముగియడంతో మళ్ళీ టెండర్స్‌కు ఆహ్వానించింది. అప్పుడు పెప్సీ తప్ప మరో కంపెనీ  ముందుకు రాలేదు. దాంతో ఇంతక ముందు కంటే దాదాపు 40 శాతం ధరను తగ్గించింది కాబట్టి ఆ ఒప్పందం కుదరలేదు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఇంగ్లాండ్ పర్యటనలో మూడు టెస్టులు మరియు టీ 20 ఇంటర్నేషనల్ ఆడటానికి సిద్దమైంది. మొదటి టెస్ట్ ఆగస్టు 5 నుండి 9 వరకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతుంది,