అయోధ్య రామాలయంపై పాక్ సంచలన వ్యాఖ్యలు...

అయోధ్య రామాలయంపై పాక్ సంచలన వ్యాఖ్యలు...

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు అధికారికంగా ఇటీవలే ప్రారంభమయ్యాయి.  కేంద్రం అయోధ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేసి బాధ్యతను అప్పగించిన తరువాత ఈ పనుల్లో వేగం పెరిగింది.  కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్ళు పక్కన పెట్టినా లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి.  

అయోధ్యలోని వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిలో రామ్ లల్లా ఆలయం నిర్మించేందుకు అప్పగించింది.  ఇక అయోధ్యలో మరో చోట 5 ఎకరాల భూమిని కేటాయించింది.  ఇక ఇదిలా ఉంటె, అయోధ్య నిర్మాణంపై పొరుగునే ఉన్న శతృదేశం పాకిస్తాన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.  కరోనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, బీజేపీ, దాని అనుబంధ సంస్థలు రామాయలయ నిర్మాణానికి పూనుకోవడం ఏంటని విమర్శించింది.  జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 అమలు చేసి ముస్లింల స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఇండియాపై ఆరోపణలు చేసింది పాకిస్తాన్.  రామాలయంపై పాక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.