రివ్యూ : పహిల్వాన్ 

రివ్యూ : పహిల్వాన్ 

 

నటీనటులు : కిచ్చ సుదీప్, ఆకాంక్ష సింగ్, సునీల్ శెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దుహన్ సింగ్, అవినాష్ తదితరులు

మ్యూజిక్: అర్జున్ జన్య

సినిమాటోగ్రఫీ: కరుణాకర ఏ 

నిర్మాత: జీస్టుడియోస్, ఆర్ఆర్ఆర్ మోషన్ పిక్చర్స్, వారాహి చలన చిత్ర

దర్శకుడు: ఎస్ కృష్ణ 

కిచ్చ సుదీప్ ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు.  ఈగ తరువాత బాహుబలి సినిమాలో కూడా కనిపించి మెప్పించారు.  తరువాత తెలుగులో కొన్ని సినిమాలు చేశారు.  ఈరోజు సుదీప్ హీరోగా చేసిన పహిల్వాన్ మూవీ రిలీజ్ అయ్యింది.  పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.  

కథ: 

కిచ్చ సుదీప్ ఓ అనాధ.  అతడ్ని కుస్తీ పహిల్వాన్ సునీల్ శెట్టి చేరదీస్తాడు.  చిన్నతనం నుంచి తనదగ్గరే ఉంచుకొని పెంచి పెద్దచేస్తాడు.  సుదీప్ చిన్నప్పటి నుంచి కుస్తీ వావతారణంలో పెరగడం వలన గురువు దగ్గర ఆ విద్యను నేర్చుకుంటాడు. కుస్తీ పోటీల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో సుదీప్ కు ఆకాంక్ష సింగ్ కనిపిస్తుంది.  ఆమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు.  ఆమె చుట్టూ తిరుగుతూ కుస్తీని నిర్లక్ష్యం చేస్తాడు.  విషయం తెలిసిన సునీల్ శెట్టి మందలించినా వినడు.  ఆకాంక్షిసింగ్ ను వివాహం చేసుకుంటాడు.  గురువు సునీల్ శెట్టికి ఇది నచ్చదు.  దీంతో తన దగ్గర నేర్చుకున్న కుస్తీని ఎక్కడ ప్రదర్శించవద్దని చెప్పి, సుదీప్ ను ఇంటి నుంచి పంపించేస్తాడు.  గురువు అజ్ఞను జవదాటని సుదీప్ అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తాడు.  ఆ తరువాత ఎలా బాక్సర్ గా మారాడు.. తిరిగి గురువు సునీల్ శెట్టిని ఎలా కలిశాడు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

గతేడాది కన్నడం నుంచి వచ్చిన కేజీఎఫ్ సినిమా భారీ హిట్ అయ్యింది.  ఆ సినిమా తరువాత అక్కడి నుంచి భారీ సినిమాలు రావడం మొదలయ్యాయి.  గతంలో ఏవో కొన్ని సినిమాలు మాత్రమే బయట భాషల్లో డబ్బింగ్ చేసుకునేవి.  కానీ, కేజీఎఫ్ తరువాత భారీ సినిమాలు తీస్తూ వాటిని తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.  ఈ తరహాలోనే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పహిల్వాన్ సినిమా రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి అందులో ఉండాల్సిన మలుపులు, స్పోర్ట్స్, డ్రామా అన్ని ఉంటాయి.  పహిల్వాన్ సినిమాలో వీటితో పాటు సెంటిమెంట్ కూడా ఎక్కువైంది.  ఈ సెంటిమెంట్ కారణంగా సినిమా కొంత పక్కదోవ పట్టింది.  సుదీప్ హీరోయిజం చుట్టూనే సినిమా నడిచింది.  కన్నడంలో సుదీప్ సార్ నటుడు కాబట్టి వర్కౌట్ అవుతుంది.  తెలుగులో సుదీప్ విలన్ రోల్స్ చేశారు.  సో, ఆయన్ను ఎలా రిలీజ్ చేసుకుంటారు అన్నది తెలియాలి.  

స్పోర్ట్స్ డ్రామాలో దానికి తగిన ఎమోషన్స్ ఉన్నట్టయితే సినిమా వేరుగా ఉంటుంది.  ఈ ఎమోషన్ ను పండించడంలో దర్శకుడు కృష్ణ కాస్త తడబడ్డాడు.  ఇది సినిమాకు మైనస్ గా మారింది.  తమ్ముడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిలానే క్లైమాక్స్ ను అద్భుతంగా తీశారు.  సినిమాకు క్లైమాక్స్ ఒక్కటే బాగుంటే సరిపోదు కదా.. సెకండ్ సెంటిమెంట్ సన్నివేశాలను కాస్త తగ్గించి స్పోర్ట్స్ ఎమోషన్ ను మిక్స్ చేసినట్టయితే బాగుండేది.  కిచ్చ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్ అని చెప్పాలి.  

నటీనటుల పనితీరు: 

సుదీప్ సినిమాకు ప్రధాన ఆకర్షణ నిలిచాడు.  పహిల్వాన్ గా అద్భుతంగా నటించాడు.  తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించాడు.  పోరాట సన్నివేశాల్లో తన సత్తా ఏంటో చూపించాడు.  సుదీప్ గురువుగా సునీల్ శెట్టిని తీసుకోవడం సినిమాకు కలిసి వచ్చింది.  శిష్యుడిని పహిల్వాన్ గా తీర్చిదిద్దే విషయంలో గురువు తీసుకునే శ్రద్ధను చక్కగా చూపించారు.  హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్ర చిన్నదే.  విలన్ గా చేసిన కబీర్ దుహన్ సింగ్ పర్వాలేదనిపించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

పహిల్వాన్ కథను ఎంచుకొని, దానికి సుదీప్ ను హీరోగా తీసుకొని మంచి పని చేశాడు దర్శకుడు కృష్ణ.  అయితే, కథను నడిపించే విషయంలో అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు చేశారు.  ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో జానీ సినిమాలో లాగ సెంటిమెంట్ ఎక్కువైంది.  ఇదే సినిమాకు డ్రా బ్యాక్ అయ్యింది.  అర్జున్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  కరుణాకర సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

సుదీప్ 

సునీల్ శెట్టి 

కథ 

మైనస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ 

చివరిగా :  అభిమానులను మెప్పించే పహిల్వాన్..