తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికే ఆ అవార్డులు 

తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికే ఆ అవార్డులు 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర సర్కార్ పద్మ పురస్కారాలను ప్రకటించింది.  102 మందికి పద్మశ్రీ, 10 మందికి పద్మభూషణ్, ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి.  అయితే, 102 మందికి పద్మశ్రీలు ప్రకటించగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురికి మాత్రమే ఈ పురస్కారాలు దక్కాయి.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్నవరకు రామస్వామి, అసవాడి ప్రకాశ్ రావు పద్మశ్రీలు దక్కగా, తెలంగాణ నుంచి కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.  ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన గాయని చిత్రకు పద్మభూషణ్, గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కు పద్మవిభూషణ్ దక్కడం విశేషం.