మరో దెబ్బ.. సైనికి గాయం

మరో దెబ్బ.. సైనికి గాయం

ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఆటగాళ్లు వరుసగా గాయాలపాలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జట్టులోని సీనియర్ పేసర్లు అందరు గాయం కారణంగా తప్పుకోగా ఈరోజు ప్రారంభమైన నాల్గొవ టెస్ట్ లో మొత్తం అనుభవం లేని యువపేసర్లతో ఆడుతుంది టీం ఇండియా. అయితే ఇప్పుడు భారత్ కు మరో దెబ్బ తగిలింది. మూడో టెస్ట్ మ్యాచ్ లో రాణించిన భారత పేసర్ నవదీప్ సైని గాయం బారిన పడ్డాడు. 37వ ఓవర్లో 5వ బంతి వేసి అక్కడే కుప్ప కూలిపోయిన సైని ఆ ఓవర్ ను ముగించకుండానే బయటకు వచ్చేసాడు. దాంతో ఆ చివరి బంతిని రోహిత్ శర్మ వేసి ఓవర్ ముగించాడు. అయితే సైని మళ్ళీ తిరిగి వచ్చి బౌలింగ్ చేయగలడా... లేదా అనేదాని పై ఇంకా క్లారిటీ రాలేదు.