దమ్ముంటే ఆర్డినెన్స్ తేవాలన్న ఒవైసీ

దమ్ముంటే ఆర్డినెన్స్ తేవాలన్న ఒవైసీ

అయోధ్య కేసు వాయిదా పడటంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. కేసు మళ్లీ సుదీర్ఘకాలం వాయిదా పడితే హిందువుల సహనం నశిస్తుందని, అదే జరిగితే ఏం జరుగుతుందో తలచుకుంటే తనకు భయమేస్తుందని గిరిరాజ్ కామెంట్ చేశారు. దానికి స్పందించిన అసదుద్దీన్ కేసు త్వరగా తెమలాలంటే ఆర్డినెన్స్ తీసుకురావొచ్చని, దమ్ముంటే ఆ పని మోడీ చేయాలని సవాల్ విసిరారు. ఇందుకోసం మోడీకి ఆయన ఓ సూచన కూడా చేశారు. జనవరిలో కేసు విచారణకు వచ్చినప్పుడు.. మోడీ సర్కారు బెంచ్ ముందు హాజరై ఇప్పుడున్న అటార్నీ జనరల్ స్థానంలో న్యాయశాస్త్రకోవిదుడైన గిరిరాజ్ ను అటార్నీ జనరల్ గా నియమిస్తున్నామని కోర్టుకు నివేదించాలని సవాల్ చేశారు.