బాబ్రీ కేసు: రాహుల్ ను ఒవైసీ ఏమన్నారంటే..

బాబ్రీ కేసు: రాహుల్ ను ఒవైసీ ఏమన్నారంటే..

ఒకప్పుడు కాంగ్రెస్ తో చెట్టపట్టాలేసుకొని తిరిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఇప్పుడదే పార్టీని తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాదని, సూడో సెక్యులర్ పార్టీ అని విమర్శించారు. అందుకు ఉదాహరణగా బాబ్రీ కేసును ఉటంకించారు.

కాంగ్రెస్ లో ఉన్న ప్రఖ్యాత లాయరు, ఆ పార్టీ ఎంపీ అయిన కపిల్ సిబాల్ ను బాబ్రీ కేసు వాదించకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఒక లాయరు ఏ కేసైనా వాదించవచ్చని, అలాంటి వ్యక్తిని బాబ్రీ కేసు వాదించకుండా ఎందుకు ఆదేశించారో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పాలని సవాల్ విసిరారు. ఒవైసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు.