ఇండియా నయా రికార్డ్: రోజుకు 5 లక్షల పీపీఈ కిట్లు తయారీ 

ఇండియా నయా రికార్డ్: రోజుకు 5 లక్షల పీపీఈ కిట్లు తయారీ 

కరోనా మహమ్మారి ఇండియాలో మార్చి నెల నుంచి వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది.  కరోనా ప్రారంభంలో ఇండియాలో ఒక్క కరోనా కిట్ లేదు. పీపీఈ కిట్లు లేవు.  ప్రతి దానికి ఇతర దేశాలపై పడవలసి వచ్చేది.  మాస్కులు లేవు, శానిటైజర్లు లేవు.  ఇది ఆరు నెలల కిందటి మాట.  గడిచిన ఆరునెలల కాలంలో కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూ సొంతంగా కరోనా నిర్ధారణ పరీక్షల కిట్లు, అవసరమైన పీపీఈ కిట్లు తయారు చేసుకున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.  ఒకప్పుడు కరోనా కిట్లు అందుబాటులో లేవని చెప్పిన రాష్ట్రాలు ఇప్పుడు తయారు చేసుకున్న కరోనా కిట్లను ఉంచేందుకు స్థలం లేదని అంటున్నారని అన్నారు.  ప్రతిరోజూ ఇండియాలో ఐదు లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.