యూజీసీ-నెట్‌, ఓయూ పరీక్షలు వాయిదా..!

యూజీసీ-నెట్‌, ఓయూ పరీక్షలు వాయిదా..!

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పరీక్షలను వాయిదా వేసింది.  రేపు, ఎల్లుండి జరగాల్సిన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బీసీఏ, బీఫార్మా, బీహెచ్‌ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు యూజీసీ-నెట్‌ పరీక్షలు కూడా మరోసారి వాయిదా పడ్డాయి. కొన్ని అనివార్య కారణాల వల్లనే పరీక్షలు వాయిదా వేశామని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అయితే జరగాల్సి ఉన్న మిగతా పరీక్షలు నిర్ణయించిన తేదీల్లోనే నిర్వహిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా యూజీసీ ఆదేశాల మేరకు అన్ని యూనివర్సిటీలు యూజీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆదేశాలమేరకు ఉస్మానియా వర్సిటీ కూడా యూజీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కొన్ని పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.