సౌతాంప్టన్‌తో మరో ఒప్పందం

సౌతాంప్టన్‌తో మరో ఒప్పందం

సౌతాంప్టన్: ఫాట్ బాల్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ మంది చూసే క్రీడగా నిలిచింది. ఇందులోని ఆటగాళ్లకు భారీగా క్రేజ్ వస్తుంది. కానీ మన దేశంలో ఇప్పుడిప్పుడే ఫూట్ బాల్ మొలకెత్తుతోంది. దాదాపు విదేశాలలో ఫుట్ బాల్‌కు దాని ఆటగాళ్లకు అమితమైన క్రేజ్ ఉంది. అయితే స్పానిష్ ఫుట్ బాల్ జట్టు ఆటగాడు ఓరియోల్ రోమ్యూకు అక్కడ సూపర్ స్టార్‌లాంటి క్రేజ్, అతడు ఎందరికో కలల రాకుమారుడు, మరెందరికో ఆదర్శంగా నిలిచాడు. అతడు ఇటీవల ఓ ప్రీమియర్ లీగ్ క్లబ్‌తో ఓ ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఈ క్లబ్ పేరు సౌతాంప్టన్ ఎఫ్‌సీ, ఈ జట్టుతో నేడే ఈ ఒప్పందం చేసుకున్నాడు. ఓరియోల్ ఈ జట్టుతో చేసుకున్న ఒప్పందం అంతానికి వచ్చిందనుకున్న సమయంలో ఆ ఒప్పందాన్ని మరో రెండున్నర సంవత్సరాలకు పొడిగించాడు. ఈ ఒప్పందం 2023 వరకూ ఉంటుందని అతడు తెలిపాడు. ‘ఇక్కడ ఉండటం నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఇంక్కడి వరకూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ ప్రయాణం చేస్తున్నాను, కానీ అలుపు రావడంలేదు. ఈ ప్రయాణాన్ని నాకు కుదిరినంతకాలం కొనసాగిస్తాన’ని చెప్పాడు. ఈ 29 సంవత్సరాల ఆటగాడు బార్సలోనా అకాడమీలోని సౌతాంప్టన్ జట్టుకు గత ఆరెళ్లగా ఆడుతున్నాడు. ఇతడు ఇప్పటికి మొత్తం 198 మ్యాచుల్లో కనిపించాడు. అంతేకాకుండా 2016-2017 సంత్సరాలలో సీజన్ బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.