పులికోసం కొనసాగుతున్న ఆపరేషన్... 

పులికోసం కొనసాగుతున్న ఆపరేషన్... 

కొమరం భీం జిల్లాలో పులుల సంచారం ఎక్కువైంది.  పశువులు, మేకలతో పాటుగా మనుషులపై కూడా పులులు దాడులు చేస్తుండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.  జిల్లాలో పులులు సంచరించే 8 ప్రాంతాలను అటవీశాఖాధికారులు గుర్తించారు.  ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకోవడం కోసం మత్తుమందు ఇచ్చే బృందాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ నుంచి ప్రవీణ్, మహారాష్ట్ర తడోబా టీమ్ నుంచి రవికాంత్ నిపుణులతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నది.  పులిని బంధించేందుకు షార్ప్ షూటర్లు రంగంలోకి దిగారు.  వీలైనంత త్వరగా పులిని పట్టుకుంటామని అటవీశాఖాధికారులు చెప్తున్నారు.