హైదరాబాద్‌ లో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు..

హైదరాబాద్‌ లో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు..

భాగ్యనగరంలో మరో అతి పెద్ద బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు దుర్గంచెరువు బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 నుంచి దుర్గంచెరువుకు ఈ బ్రిడ్జిని కనెక్టివిటీ చేశారు.  ఈ వంతెనను కేబుల్స్‌తో నిర్మించారు. దేశంలోనే అతిపెద్ద తీగల వంతెనగా దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిగా నిలవనుంది. ఈ వంతెన ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్‌కే ఒక మణిహారంగా నిలవనుంది. శని, ఆదివారం దీనిపై వాహనాలకు అనుమతి నిలిపివేసి.. ఆ రెండ్రోజులూ ప్రజలు, పర్యాటకులూ… ఈ బ్రిడ్జిపై వాకింగ్ చేయడం కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.