ఒకేఒక్క ఓవర్లో 77 పరుగులు... ఇదెక్కడైనా విన్నారా?

ఒకేఒక్క ఓవర్లో 77 పరుగులు... ఇదెక్కడైనా విన్నారా?

క్రికెట్ లో ఒక ఓవర్లో మహా అయితే 36 పరుగులు వస్తాయి.  లేదంటే అదనపు పరుగుల రూపంలో ఒకటో రెండో రావొచ్చు.  36 నుంచి 38 పరుగులు వచ్చే అవకాశం ఉంటుంది.  అంతకు మించి రావడం అంటే కుదరని పని. కానీ, ఒకే ఓవర్లో 77 పరుగులు రావడం ఎప్పుడైనా చూశారా? ఎక్కడైనా చూశారా ? అంటే లేదని చెప్పాలి.  ఎందుకంటే, ఒకే ఓవర్లో ఈ స్థాయిలో పరుగులు రావడం అన్నది మాములు విషయం కాదు.  

క్రికెట్ అన్నది ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఓవర్ కు 6 బంతులు మాత్రమే ఉంటాయి.  అంతకు మించి ఒక్క బంతి కూడా ఉండదు.  కానీ, ఇక్కడ జరిగిన సంఘటన వేరు. ఒకే ఓవర్లో ఓ బౌలర్ 77 పరుగులు ఇవ్వడం అంటే మాములు విషయం కాదు కదా.  ఈ సంఘటన 1990 ఫిబ్రవరి 20 వ తేదీన న్యూజిలాండ్ లో జరిగింది.  న్యూజిలాండ్ లో వెల్లింగ్టన్, కాంటర్ బరి జట్ల మధ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నది.  ఈ మ్యాచ్ లో వెల్లింగ్టన్ 59 ఓవర్లలో 290 పరుగులు చేసి, కాంటర్ బరి ముంది 291 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  కానీ ఆ జట్టు మరో రెండు ఓవర్లు ఉన్నాయి అనగా కేవలం 196 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది.  గెలవాలి అంటే ఇంకా చాలా పరుగులు కావాలి.  రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి.  ఈ సమయంలో ఎవరైనా సరేగెలుస్తారని అనుకుంటారా చెప్పండి.  కానీ కాంటర్ బరి జట్టు గెలిచినంత పనిచేసింది.  58 ఓవర్లో ఏకంగా 77 పరుగులు చేసింది.  58 ఓవర్లో 17 నోబాల్స్ వేశాడు బౌలర్.  దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.  ఓవర్ ఎంత చెత్తగా వేసి ఉంటారో.  చివరి ఓవర్లో గెలుపుకు 18 పరుగులు అవసరం అనగా కేవలం 17 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.