ఊపిరి పీల్చుకున్న ఏపీ...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 300 దాటిపోయింది. కరోనా పాజిటివ్ కేసులు నిన్నటి వరకు వేగంగా పెరిగిపోయాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ లను ఏర్పాటు చేసి లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే, గడిచిన 12 గంటల సమయంలో ఏపీలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఇది కొంతవరకు ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. గుంటూరు నగరంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో మొత్తం ఏపీలో 304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈరోజు నమోదైన పాజిటివ్ కేసుతో కలిపి గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య 33 కు చేరింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు జరిపిన పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే రావడం కొంత ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)