హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్.. అవంతికి ప్రాణహాని..!

హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్.. అవంతికి ప్రాణహాని..!

హైదరాబాద్‌ శివారులో జరిగిన హేమంత్ కుమార్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు.. తాజాగా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. హేమంత్ కేసులో మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తున్నారు హేమంత్ భార్య అవంతి.. ఈ హత్యలో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందంటున్న అవంతి... గతంలో హేమంత్ తండ్రిని సందీప్ రెడ్డి బెదిరించారని చెబుతున్నారు. రెండు లక్షలు తీసుకున్నాడు అంటూ నెల రోజుల క్రితం సందీప్‌రెడ్డి బెదిరించినట్టుగా తెలుస్తుండగా.. హేమంత్ కిడ్నాప్ అయిన రోజే సందీప్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సందీప్ రెడ్డి నుండి నాకు కూడా ప్రాణహాని ఉందని చెబుతున్నారు అవంతి.