భారతీయులకు వరంగా ట్రంప్ నిర్ణయం ?

భారతీయులకు వరంగా ట్రంప్ నిర్ణయం ?

ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులకు వరంగా మారనుంది. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిం చేందుకు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న ట్రంప్‌ అందులో భారతీయులకు మినహాయింపు ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇచ్చే గ్రీన్‌కార్డులను నిలిపివేసి ఎంప్లాయ్‌మెంట్‌ కోటాలోని వారికే ఇస్తుండటంతో.. లక్షా పదివేల మందికి గ్రీన్‌కార్డులు దక్కనున్నాయి. అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం అక్కడ ఉంటున్న భారతీయులు ఎన్నో ఏళ్లుగా వేచిచూస్తుంటారు. అలాంటివారికి ఇది తీపి కబురే. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల లక్షా పది వేల మంది భారతీయులకు గ్రీన్ కార్డ్ లభించే అవకాశం దక్కనుంది. 2020 వరకు గ్రీన్‌కార్డులు, పర్మినెంట్ రెసిడెంట్ - పీఆర్‌లను నిలిపివేశారు అధ్యక్షుడు ట్రంప్.

అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశంతో ఈనిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో ఇండియన్స్‌కు మినహాయింపు ఇచ్చారు. రూల్స్ ప్రకారం సెప్టెంబర్ చివరివరకు వాడని ఫ్యామిలీ బేస్డ్ పీఆర్‌ కార్డులను అక్టోబర్ 1నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ఎంప్లామెంట్‌ బేస్డ్‌ కోటాకు మార్చుతారు. ఇది భారతీయులకు ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇప్పుడు ఇండియన్స్‌ మంచి అవకాశం వచ్చింది. మొత్తానికి లక్షా పదివేల మందికి గ్రీన్‌కార్డులు దక్కనున్నాయి. అమెరికా ఏటా లక్షా 40వేల గ్రీన్‌ కార్డులను ఇస్తోంది. ఇప్పటికే పదిలక్షల మంది వలసదారులు శాశ్వత నివాసం కోసం వేచిచూస్తున్నారు. ఇందులో భారతీయులు మూడులక్షల మంది ఉన్నారు. అయితే బ్యాక్‌లాగ్ క్లియర్ చేస్తేనే భారతీయులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.