బిగ్ న్యూస్: ఇండియాలో లక్ష దాటిన కరోనా కేసులు 

బిగ్ న్యూస్: ఇండియాలో లక్ష దాటిన కరోనా కేసులు 

ఇండియాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది.  కరోనా కేసులు రోజు రోజుకు పెరిపోతున్నాయి.  కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. గత రెండు నెలలుగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా కరోనా మాత్రం అదుపులోకి రావడం లేదు.  రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.  కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి ఇండియాలో లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే.  

ఇక ఇదిలా ఉంటె, లాక్ డౌన్ 4 అమలు ప్రారంభమైన రోజు రాత్రి 10 గంటల సమయంలోనే ఇండియాలో కరోనా కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది.  తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఇండియాలో 1,00,328 కేసులు నమోదయ్యాయి.  ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  ఇప్పటి వరకు ఇండియాలో 3,156 మరణాలు సంభవించాయి.  కరోనా కేసుల్లో ఇండియా ప్రపంచంలో 11 వ స్థానంలో నిలిచింది.