పార్టీ కాల్పుల్లో ఒకరి మృతి

పార్టీ కాల్పుల్లో ఒకరి మృతి

లాస్‌ఏంజెల్స్: పార్టీ కాల్పుల్లో ఒకరు చనిపోయారని, మరి కొందరు గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన యూఎస్‌లోని ఫీనిక్స్‌లో చోటుచేసుకుంది. అయితే శనివారం జరిగిన పార్టీలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయని దాంతో అక్కడి వారు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలాకి పోలీసులు చేరేసరికి ఒకరు మరణించడంతో పాటు మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని పోలీసుల తెలిపారు. బాదితుల వయోపరిమితి 17 నుంచి 20 వరకు వారేనని తెలిపారు. అయితే కాల్పులు అనధికార పార్టీ కారణంగా జరిగిందని, ఖాళీ బిల్డింగ్‌లో పార్టీ చేసుకునేందుకు వారికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ కాల్పులు ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనే వాటిపై విచారణ జరుగుతుందని పోలీసుల అన్నారు. అంతేకాకుండా మరిన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.