ఇంగ్లాండ్-వెస్టిండీస్ : అర్ధశతకాలతో రాణించిన ఆతిథ్య బ్యాట్స్మెన్స్... 

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : అర్ధశతకాలతో రాణించిన ఆతిథ్య బ్యాట్స్మెన్స్... 

కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య మొదటి అంతర్జాతీయ టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ నిన్న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగ్గిన ఇంగ్లాండ్ కరేబియన్ల బౌలింగ్ ధాటికి ముందు తడబడింది. ఓపెనర్ రోరే బర్న్స్(57) అర్ధశతకంతో రాణించిన మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లీ ఒక పరుగు చేయకుండానే వెనుదిరిగాడు. ఆ రతర్వాత వచ్చిన కెప్టెన్ జో రూట్(17) వద్ద రన్ ఔట్ కాగా వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్(20) పరుగులు చేసి నిరాశపరిచారు. అలా 122 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్ ను ఆలీ పోప్(91), జోస్ బట్లర్(56) అజేయంగా నిలిచి మరో వికెట్ పడకుండా 258 పరుగుల వద్ద మొదటి రోజును ముగించారు. ఇక కరేబియన్ బౌలర్ లు కేమర్ రోచ్ 2 వికెట్లు, రోస్టన్ చేజ్ ఒక వికెట్ తీసుకున్నారు.