80 డాలర్లకు చేరువలో చమురు
ముడి చమురు ధరల జోరుకు అడ్డేలేకుండా పోయింది. రాత్రి వెలువడిన అమెరికా వారపు చమురు నిల్వల డేటాతో చమురు ధరలు మళ్ళీ పుంజుకున్నాయి. చమురు నిల్వలు లక్షన్నర బ్యారెల్స్ తగ్గడంతో ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన చమురు ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. వాస్తవానికి డాలర్ ఇండెక్స్ 93ని దాటింది. డాలర్ చాలా బలంగా ఉన్న సమయంలోచమురు ధరలు తగ్గాలి. కాని డిమాండ్ భారీగా ఉండటంతో తగ్గకపోగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ధర 79.40 డాలర్లకు చేరింది. ఈ సాయంత్రానికి అంటే అమెరికా మార్కెట్ల ఓపెనింగ్కల్లా ధర 80 డాలర్లను దాటే అవకాశముంది. మరోవైపు అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర కూడా 71.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)