దిగొస్తున్న చమురు ధరలు

దిగొస్తున్న చమురు ధరలు

గత కొద్దిరోజులుగా చుక్కల్లో ఉన్న చమురు ధరలు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికి చమురు ధర ఆరు నెలల కనిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఇరాన్ మరియు వెనిజులా నుంచి సప్లై తగ్గడంతో.. ఇంధన కొరతను అధిగమించడానికి ఓపెక్ దేశాలతో పాటు రష్యా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం చమురు ధరలపై ప్రభావం చూపింది. దీంతో చమురు ధరలు దిగివస్తున్నాయి. 2017 ఏప్రిల్ 17న బ్యారెల్ ముడి చమురు ధర 65.80 డాలర్లుగా నమోదవ్వగా.. తిరిగి ఇవాళ 66.37 డాలర్ల వద్ద స్ధిరపడింది. ధరల స్థిరీకరణతో పాటు పెట్రోల్ ఉత్పత్తి దేశాల మధ్య ధీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓపెక్ దేశాలు వచ్చే నెల 22న వియన్నాలో సమావేశం కానున్నాయి.