సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో ‌`ఓదెల రైల్వేస్టేష‌న్`

సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో ‌`ఓదెల రైల్వేస్టేష‌న్`

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`‌, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించనున్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఓదెలలో మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్‌. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి.  ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన చిత్ర‌యూనిట్ ఈ రోజు(అక్టోబ‌ర్ 30) నుండి రెండో షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ అయ్యింది.