సెప్టెంబర్ 22, మంగళవారం దినఫలాలు

సెప్టెంబర్ 22, మంగళవారం దినఫలాలు

మేషం: రావలసిన సొమ్ము అందక ఇబ్బంది. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యసమస్యలు.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వాహనయోగం.

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బందువులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు కలిసివచ్చే కాలం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు నూతన అవకాశాలు. వాహనయోగం.

కన్య:  ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో కలహాలు. వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. బంధువులను కలుస్తారు.

తుల: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. అందరిలోనూ గుర్తింపు

వృశ్చికం: కొత్త ఉద్యోగప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు.

ధనుస్సు: కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దుబారా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు.

మకరం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: కొత్త పనులు ప్రారంభం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.