జనవరి 26, మంగళవారం రాశిఫలాలు

జనవరి 26, మంగళవారం రాశిఫలాలు

మేషం : ఈ రోజు మీరు ఒక పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశం ఉంది. మీ పథకాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచడం మంచిది. చెల్లింపులు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. 

వృషభం : ఈ రోజు మీ వృత్తి వ్యాపారాల్లో సానుకూలతలెదుర్కొంటారు. తొందరపడి హామీలిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. బంధువులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేయడం మంచిదికాదు. 

మిథునం : ఈ రోజు విదేశాల్లోని అయిన వారి క్షేమ సమచారం అందటంతో మనస్సు కుదుపటడుతుంది. నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. 

కర్కాటకం : గత కొంతకాలంగా మిమ్మలను ఆందోళనకు గురిచేసిన సమస్య ఈ రోజు పరిష్కారమవుతుంది. ఉద్యోగస్తుల సమర్థత, సమయస్పూర్తికి గుర్తింపు, నగదు బహుమతి వంటి ప్రోత్సాహాకాలున్నాయి. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. 

సింహం : ఈ రోజు ఇంటి అద్దెలు, బాకీలు వసూలులో సంయమనం పాటించండి. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహపరుస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫూర్తినిస్తుంది. 

కన్య : ఈ రోజు మీ వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాకయం. మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. చిన్నతరహా పరిశ్రమలు ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పురోభివృద్ధి ఉంటుంది. 

తుల : ఈరోజు ఈ రాశిలోని కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి అసహనం. చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కార్యక్రమాలలో పనులు సానుకూలమవుతాయి. ఆస్తి పంపకాలు సమస్య అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారమవుతుంది. 

వృశ్చికం : ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. మీ సమర్థత, నిజాయితీలు ప్రముఖులను ఆకట్టుకుంటాయి. బంధువులు మీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు మనస్థాపం కలిగిస్తాయి. 

ధనస్సు : ఈ రోజు మీరు వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. 

మకరం : ఈరోజు ఈ రాశిలోని విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. నగదు, విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

కుంభం : ఈ రోజు మీరు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త వహించడం మంచిది... క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. దంపతుల మధ్య మనస్పర్థలు తొలగి ప్రేమానుబంధాలు పెంపొందుతాయి. 

మీనం : ఈ రోజు మీ మాటతీరు, పద్దతులను ఎదుటివారికి నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు అధికారులు సిఫార్సు చేస్తారు. ధనార్జనే ధ్యేయంగా భావించక కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి.