నవంబర్ 1, ఆదివారం దినఫలాలు

నవంబర్ 1, ఆదివారం దినఫలాలు

మేషం: మీరు కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు, గృహంలో ఒక శుభకార్యానికి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.

వృషభం: ఈ రాశిలోని పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. రాబడికి మించి ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు.

మిథునం: ఈ రాశిలోని చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి అధికం. 

కర్కాటకం: మీపై ఆధారపడిన వారి పట్ల విజ్ఞతాయుతంగా మెలగండి. సమస్యలు అవే సర్దుకుంటాయి. బిల్లులు చెల్లిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది.

సింహం: ఈ రాశిలోని వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అన్నివిధాలా కలిసిరాగలదు. ఏ విషయంలోను దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.

కన్య: ఈ రాశిలోని వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. 

తుల: మీరు వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు అందరితోను కలుపుగోలుగా వ్యవహరిస్తారు. అతిథి మర్యాదలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మిత్రుల హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. 

వృశ్చికం: ఈ రాశిలోని ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. 

ధనస్సు: ఈ రాశిలోని కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. హోటల్, క్యాటరింగ్ పనివారలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. 

మకరం: మీరు హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. 

కుంభం: ఈ రాశిలోని స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి ఉంటుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలకు గురికావలసి వస్తుంది.

మీనం: ఈ రాశిలోని దంపతుల మధ్య అపోహలు తొలగి అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు.