జనవరి 23, శనివారం రాశిఫలాలు

జనవరి 23, శనివారం రాశిఫలాలు

మేషం : ఈ రోజు మీరు ఓ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. మీ పథకాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచడం ఎంతో మంచిది. చెల్లింపులు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. 

వృషభం : ఈ రోజు మీకు వృత్తి వ్యాపారాల్లో సానుకూలతలు ఉంటాయి.. మీపై సెంటిమెంట్లు గత అనుభవాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. తొందరపడి హామీలిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. బంధువులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేయడం మంచిదికాదు. 

మిథునం : ఈ రోజు విదేశాల్లో ఉన్న మీవారి క్షేమ సమచారం అందుకుంటారు.. నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. 

కర్కాటకం : ఈరోజు ఎంతోకాలంగా ఆందోళనకు గురిచేస్తున్న సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. ఉద్యోగస్తుల సమర్థత, సమయస్పూర్తికి గుర్తింపు, నగదు బహుమతి వంటి ప్రోత్సాహాకాలున్నాయి. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.

సింహం : ఈ రోజు మీరు ఇంటి అద్దెలు, బాకీలు వసూలులో సంయమనం పాటించండి.. దురుసుగా ఉండడం మంచిదికాదు.. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహపరుస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.

కన్య : ఈ రోజు మీ వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాకయం. మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. 

తుల : ఈ రోజు కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి అసహనం. చికాకులు తప్పవు.. ప్రభుత్వం కార్యక్రమాలలో పనులు సానుకూలమవుతాయి. ఆస్తి పంపకాలు సమస్య అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారమవుతుంది. మీ సిఫార్సుతో నిరుద్యోగులకు మంచి అవకాశం లభించే అవకాశంఉంది.

వృశ్చికం : ఈ రోజు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. మీ సమర్థత, నిజాయితీలు ప్రముఖులను ఆకట్టుకుంటాయి. బంధువులు మీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు మనస్థాపం కలిగిస్తాయి. 

ధనస్సు : ఈ రోజు మీ వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త వహించండి.. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. 

మకరం : ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. నగదు, విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

కుంభం : ఈ రోజు ఈ రాశిలోని పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసేటప్పుడు జాగ్రత్త వహించండి... క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. దంపతుల మధ్య మనస్పర్థలు తొలగి ప్రేమానుబంధాలు పెంపొద్దుతాయి.

మీనం : ఈ రోజు మీ మాటతీరు, పద్దతులను ఎదుటివారికి నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది.. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు అధికారులు సిఫార్సు చేస్తారు. ధనార్జనే ధ్యేయంగా భావించక కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి ఉపయోగకరంగా ఉంటుంది.