జనవరి 17, ఆదివారం రాశిఫలాలు 

జనవరి 17, ఆదివారం రాశిఫలాలు 

మేషం : బంధు మిత్రులకు మీపై సదాభిప్రాయం కలుగుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్‌లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వడం క్షేమంకాదు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. చేపట్టిన పనుల్లో అవాంతరాలు, చికాకులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు.

వృషభం : ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మీ అభిప్రాయాలకు ఆశించిన స్పందన వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. దంపతుల మధ్య దాపరికం తగదు. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాలు ప్రస్తావన వస్తుంది.

మిథునం : ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఏమరుపాటు వల్ల వస్తువులు చేజార్చుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వస్తారు. కోర్టు, ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది.

కర్కాటకం : ఉపాధ్యాయులకు పదోన్నతి మరికొంత సమయం పడుతుంది. ఖర్చులు ప్రయోజనకరం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒప్పందాలు, చెల్లింపుల్లో ఆచితూచి వ్యవహరించండి. మీరంటే గిట్టని వ్యక్తులతో జాగ్రత్తగా మెలగాలి. స్త్రీలకు ఉద్యోగవకాశం లభిస్తుంది. భేషజాలకు పోయి విపరీతంగా వ్యయం చేస్తారు.

సింహం : కొత్త స్కీములు అమలుతో వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాలు పడవలసి వస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో రాణిస్తారు. పత్రికా సిబ్బందికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వ్యవహార ఒప్పందాల్లో తొందరపడవద్దు.

కన్య : కాంట్రాక్టర్లకు అభ్యంతరాలెదురవుతాయి. మీ శ్రీమతితో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో జాగ్రత్త అవసరం. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ఓర్పుతో అన్నింటిని నెట్టుకొస్తారు. పొదుపు పథకాల కోసం ధనం ముందుగానే తీసుకుంటారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది.

తుల : మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. అధికారులకు తనిఖీలు పర్యటనలు అధికమవుతాయి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం ముడుతుంది. పనులు కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు.

వృశ్చికం : ఆర్థిక కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేక పోతారు. వేడుకలు, విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, లోను మంజూరవుతాయి. అవకాశాలు కలిసిరాక, యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు.

ధనస్సు : మీ ప్రమేయంతో సమస్యలు పరిష్కారమవుతాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో మెళకువ అవసరం. ఆకస్మిక చెల్లింపులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లతో జాగ్రత్త వహించండి.

మకరం : లౌక్యంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. బకాయిల వసూలులో సంయమనం పాటించండి. చేతి వృత్తుల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. అధికశ్రమ, నిద్రలేమి వల్ల అస్వస్థతకు గురవుతారు.

కుంభం : ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచిది. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లతో మెళకువ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సాన్నిహిత్యం నెలకొంటుంది. వాణిజ్యం ఒప్పందాలు, చెల్లింపుల్లో జాగ్రత్త. తొందరపడి హామీలివ్వకండి.

మీనం : వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయుకృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రుణాలు తీరుస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.