జనవరి 14, గురువారం దినఫలాలు

జనవరి 14, గురువారం దినఫలాలు

మేషం : ఈ రోజు ఈరాశిలోని వస్త్ర వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది... కుటుంబీకుల కోసం ఎంత ధనం వ్యయం చేసినా వారికి సంతృప్తి ఉండదు. గృహంలో ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. 

వృషభం : ఈరోజు మీకు ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వ్యాపారాల్లో కొనుగోలుదార్లు, పనివారలను ఓ కంట కనిపెట్టుకోవడం ఉత్తమం. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కావడంతో పనులు పునఃప్రారంభమవుతాయి. 

మిథునం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు కళాత్మక పోటీల్లో నిరుత్సాహం తప్పదు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. వృద్ధాప్యంలో ఉన్నవారికి శారీరక బాధలు సంభవిస్తాయి. 

కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని ఆడిట్స్, అకౌంట్స్ రంగాల వారికి పని ఒత్తిడి, చికాకులు తప్పవు. ఇతరులు మీ పట్ల ఆకర్షితలువుతారు. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు.

సింహం : ఈ రోజు మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమ తప్పదు.. 

కన్య : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అందరితో కలుపుగోలుగా మెలిగి మన్నలు పొందుతారు. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానాలు, కానుకలు అందుకుంటారు. ఎంత ధనం వచ్చినా ఖర్చుకు సిద్ధంగా ఉంటాయి. 

తుల : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలు, అవమానాలు తలెత్తె అవకాశాలున్నాయి.. ఇతరులపై ఆధారపడక స్వశక్తితోనే మీ పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాకయం. ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలుపెడతారు. 

వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు మంజూరుకాగలవు. మిమ్మల్ని పొగిడేవారే కానీ, సహకరించేవారుండరు. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. 

ధనస్సు : ఈ రోజు మీరు మిత్రుల ద్వారా ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. రుణం తీసుకోవడం, ఇవ్వడం క్షేమం కాదని గమనించండి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. ఉద్యోగస్తులకు ఆహ్వానాలు, నోటీసులు అందుతాయి. 

మకరం : ఈ రోజు మీరు ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి రావొచ్చు.. చేతిలో ధనం మితంగా ఉండటంతో ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసి రాగలదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. 

కుంభం : ఈ రోజు మీకు వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ప్రముఖుల కలయికసాధ్యంకాదు. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు మంజూరుకాగలవు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు.

మీనం : ఈరోజు ఈ రాశిలోని మత్స్యు, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. మీ స్తోమతకు మించిన వాగ్ధానాల వల్ల ఇబ్బందులెదుర్కొంటారు.