అక్టోబర్ 24, శనివారం దినఫలాలు

అక్టోబర్ 24, శనివారం దినఫలాలు

మేషం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

వృషభం: మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు.

సింహం: నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి విముక్తి..

కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. వాహనయోగం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహాన్నిస్తాయి.

తుల: పనుల్లో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి  వ్యవహారాలలో చికాకులు. అనారోగ్యం.

ధనుస్సు: కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి. వస్తులాభాలు.

మీనం: వ్యయప్రయాసలు. పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.