మార్చి 12, 2020 గురువారం దినఫలాలు

మార్చి 12, 2020 గురువారం దినఫలాలు

మేషం
ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. సప్తమ స్థానంలో చంద్ర బలం అనుకూలంగా ఉంది. బంధుప్రీతి ఉంటుంది. ఇష్టదైవ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

వృషభం
మీమీ రంగాల్లో ప్రోత్సాహకర వాతవరణము ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలున్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని చదవడం శుభప్రదం.

మిథునం
మిశ్రమకాలం. ప్రతిభతో పనులను చక్కబెడతారు. సొంతింటి నిర్మాణ విషయాలగురించి ప్రణాళికలు రచిస్తారు. గిట్టనివారితో జాగ్రత్త. కలహ సూచనా ఉంది. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. దుర్గా ధ్యానశ్లోకాలు చదివితే  చేస్తే బాగుంటుంది.

కర్కాటకం
శ్రమ పెరుగుతుంది. కొన్ని విషయాల్లో సహనం చాలా అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలో గౌరవమర్యాదలు తగ్గకుండా చూసుకోవాలి. దుర్గాదేవి సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

సింహం
కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మ కార్యాచరణ చేస్తారు. నూతన వస్తుప్రాప్తి కలదు. ఇష్టదైవ ధ్యానం మంచిది.

కన్య
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే  బాగుంటుంది.

తుల
సత్కార్యాలు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇస్టులతో కాలాన్ని గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

వృశ్చికం
మీమీ రంగాల్లో మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో బద్ధకాన్ని దరిచేరనీయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అకాలభోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. దుర్గాదేవి నామస్మరణ మనోబలాన్ని పెంచుతుంది.

ధనుస్సు
చేపట్టిన పనుల్లో తోటివారి సహకారం అందుతుంది. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శని శ్లోకం పఠిస్తే బాగుంటుంది.

మకరం
చేపట్టే పనుల్లో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వెంకటేశ్వరుడిని పూజిస్తే అశుభఫలితములు తగ్గి శుభ ఫలితములు కలుగుతాయి.  

కుంభం
మీమీ రంగాల్లో ఓర్పు పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

మీనం
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. ముఖ్య విషయాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మంచి చేకూరుతుంది. ఇష్టదేవతా  స్తోత్రము పఠిస్తే మంచిది .