'ఎవరు మీలో కోటీశ్వరుడు' అంటున్న ఎన్టీఆర్ 

'ఎవరు మీలో కోటీశ్వరుడు' అంటున్న ఎన్టీఆర్ 

'బిగ్ బాస్'గా అదరగొట్టిన జూనియర్ మరో టాక్ షోతో తెలుగువారిని అలరించబోతున్నాడు. స్టార్ మా లో వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను ఇప్పుడు జెమినీ వారు సరికొత్తగా తీసుకురాబోతున్నారు. గతంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమం తెలుగువారి మన్ననలు పొందింది. దీనికి చిరంజీవి కూడా ఓ సీజన్ హోస్ట్ గా చేశారు. అయితే ఉత్తరాదిన కెబీసీ (కౌన్ బనేగా కరోడ్ పతి) గా ఎంతో పాపులర్ అయిన ఈ ప్రోగ్రామ్ దక్షిణాదిన అంత ప్రజాదరణ పొందలేదనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ పై ఉన్న నమ్మకంతో జెమినీ వారు ఇప్పుడు చిన్న చిన్న మార్పులతో ఎన్టీఆర్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ప్రోమోను కూడా షూట్ చేశారు. ఈ ప్రోమోకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించటం విశేషం. అయితే ప్రోగ్రామ్ పేరు ను కాస్త మార్చి ఎన్టీఆర్ తో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' అనిపించబోతున్నారు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ ఈ షోపై దృష్టి పెడతారట. 
ఎన్టీఆర్-నాగ్ అటు ఇటు
బిగ్ బాస్ తొలి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ప్రోగ్రామ్ కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నాని... ఆపై రెండు సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా చేశారు. గత ఏడాది కరోనా టైమ్ లో కూడా బిగ్ బాస్ 4 కి విశేష ఆదరణ దక్కింది. ఇక నాగ్ హోస్ట్ గా చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కి కూడా అపూర్వమైన ఆదరణ లభించింది. తాజాగా దానికి జూనియర్ హోస్ట్ గావ్యవహరించబోతున్నాడు. దీనికి కూడా విశేష స్పందన దక్కుతుందనే నమ్మకంతో ఉంది జెమినీ. మరి అటు ఇటు ప్లేస్ లు మార్చుకున్న నాగ్, ఎన్టీఆర్ ఆ యా ప్రోగ్రామ్స్ కి పర్మినెంట్ హోస్ట్ లుగా మారిపోతారేమో చూద్దాం.