వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఫోటో

వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఫోటో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాంచరణ్ తో కలిసి తారక్ నటిస్తున్నాడు. అల్లూరిగా చరణ్ కనిపించబోతుంటే కొమరం భీమ్ గా నటిస్తున్నాడు ఈ మధ్య కరోనా తర్వాత షూటింగ్ ప్రారంభ సమయంలో చిత్రయూనిట్ ఓ వీడియో విడుదల చేస్తూ ఈ నెల 22 న భీమ్ టీజర్ రానున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులంతా తారక్ లుక్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో తారక్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపిస్తున్నాడు. ప్రముఖ ఫోటోగ్రాఫర్  డబ్బో రత్నాన్ని ఎన్టీఆర్ తో ఫోటో షూట్ నిర్వహిస్తున్న సమయంలో తీసినది ఈ ఫోటో . చూస్తుంటే అరవింద సమెత టైంలో దిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఫొటోలో తారక్ యమ స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటోను తారక్ అభిమానుల్లో సోషల్ మీడియాలో షేర్లు లైకులతో హోరెత్తిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు తారక్ .