ఎన్‌టీఆర్ కొత్త కారు.. ఎంతో తెలుసా..

ఎన్‌టీఆర్ కొత్త కారు.. ఎంతో తెలుసా..

చిత్ర సీమలోని ఎందరో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లను సొంతం చేసుకొని ఉన్నారు. వారిలో కొందరు కార్లను చాలా కాలం వాడుతంటే మరికొందరు తరచుగా మారుస్తారు.  ఇంకొందరు మార్చెట్లోకి వచ్చిన ప్రతి కారును తమ ఇంటిలో పెట్టుకునేందుకు కొంటారు. అందుకోసం విదేశల నుంచి కూడా తెప్పించుకుంటారు. అయితే ప్రస్తుతం అందిరి కళ్లు తాజాగా వచ్చిన లాంబొర్గిని ఉరుస్‌పై ఉన్నాయి. అంతేకాదు టాలీవుడ యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కూడా ఈ కారును కొనాలని అనుకున్నారు. మొదటి నుంచి కూడా ఎన్‌టీఆర్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఎన్నో కార్లను కొనుగోలు చేసిన ఎన్‌టీఆర్ ఈ కారును కూడా కొనుగోలు చేయాలని అనుకున్నారు. అంతే ఈ కారుని కొనుగోలు చేశారు. అయితే ఇంతకీ ఈ కారు ధర ఎంతో తెలుసా అక్షరాల రూ.5 కోట్లు. ఈ కారును ఇటలీ నుంచి తీసుకువస్తున్నట్లు సమాచారం.