ఎన్టీఆర్ జయంతి : తెలుగు వాడి చరిత్రపై చెరగని సంతకం

ఎన్టీఆర్ జయంతి : తెలుగు వాడి చరిత్రపై చెరగని సంతకం

‘‘జనని భారతి మెచ్చ.. జగతి హారతులెత్త.. 
జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా.. 
రణభేరి మ్రోగించె తెలుగోడు.. 
జయగీతి నినదించె మొనగాడు..‘ఎన్టీఆర్‌’ 

ఇది ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మొదటిలో బాలకృష్ణ వాయిస్ తో వినిపించే వాయిస్. ఇదేదో ఎలివేషన్ అని నేటి తరం వారు, పిల్లలు భావించవచ్చు, కానీ ఆయన ఏమిటి ? తెలుగు రాష్ట్రాలలో ఆయన వలన ఏర్పడిన మార్పులు ఏమిటి అనేవి తెలిస్తే ఏ తరం వారయినా ఆయనకు అభిమానులుగా మారిపోక తప్పదు. మనకు తెలిసిన విషయం సముద్రంలో ఒక నీటి బింధువు అంత, తెలియాల్సింది సముద్రమంత అన్నట్టు ఆయన గురించి మనం ఎంత చెప్పినా.. ఎన్ని సినిమాలు చేసినా ఆయన జీవితంలో ఎంతో కొంత భాగం మిగిలే ఉంటుందనడంలో అతిశయోక్తి కాడు. అటు సినిమా కానీ, ఇటు రాజకీయం కానీ ఆయన ఎంతో మందికి ఆదర్శం, ఎన్నో వేల మందికి ఆదరువు. ఆయనో అంతు లేని సముద్రం. ఈరోజు ఆయన 97వ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. 

కృష్ణా జిల్లాలో ఒక మారు మూల పల్లెటూరులో రైతుబిడ్డగా జన్మించి ఆరోజుల్లోనే బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగిగా రిజిస్టార్ వ్రుత్తిని చేపట్టి, తదనంతర కాలంలో తనకి ఆ లంచాల వాసన పడదని భావించి మద్రాసు రైలెక్కి నటుడిగా మారి, జనాల గుండెల్లో దేవుడిలా కొలువయి పోయాడు ఆయన. ఇంత పెద్దవాణ్ణి చేసిన జనానికి ఏదయినా చేయాలని భావించి రాజకీయాల్లో ప్రవేశించి, అప్పటిదాకా ముఖ్యమంత్రులు కలలో కూడా ఆలోచించలేని పనులు చేసి ఆంధ్రులకి అన్నగా ముద్ర వేసుకున్నాడు. ప్రపంచ సినీ చరిత్రలోనే అనేక భిన్నపాత్రలను పోషించిన మహానటుడు మరె క్కడా కనిపించరు. హీరోలుగా వెలుగొందుతున్న వారు ఎవరూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు వేయరు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం పురాణాలలోని నెగటివ్ షేడ్స్ ఉన్న రావణబ్రహ్మ, దుర్యోధన వంటి పాత్రలలో నటించి రక్తికట్టించి వారికి హీరో ఇమేజ్ తెచ్చారు. మరీ ,ముఖ్యంగా దానవీరశూరకర్ణ సినిమాలో కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా ఆయన చూపిన అభినయం తెలుగుప్రజల హృదయాల్లో స్థిరస్థాయిని పొందింది. 

ఒకప్పుడు తిరుపతి వెళ్ళిన వారు అంతా ఎన్టీఆర్ దర్శనం కోసం మద్రాస్ వెళ్ళేవారంటే ఆయన ప్రజల్లో ఎమీకు దగ్గరయ్యారో మనం అర్ధం చేసుకోవవ్చ్చు. ఇక తదనంతర కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు సైతం అయన రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ తెలుగు రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసిన ప్రజానేత ఆయన. చందమామ అందరికీ మామ ఎలా అయ్యాడో అలాగే ఎన్టీఆర్ కూడా వయసులతో సంబంధం లేకుండా తెలుగు ప్రజలతో అన్న  అని పిలిపించుకున్న అజరామరుడు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  తెలుగుజాతి ఆత్మగౌరవం అనే నినాదంతో… ఆయన జీవితం సాగింది.  సాగింది. తెలుగు సాహిత్యంపై అపారమైన పట్టున్న ఏకైక తెలుగు హీరో నందమూరి. అయితే ఎన్నో మంచి పనులు చేసినా ఆయన జీవితంలో వేలెత్తి చూపించుకునే పనులు ఆయన పెద్దగా చేయలేకపోయారు. ఇక నేటి కుల సమాజంలో ఆయననను ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోన్నా, ఆయన ఏమిటో ముందు తరాల వారికి బాగా తెలుసు.